భాగస్వామ్యం భగ్గుమంటది
ఈ Real Estate రంగంలో
అప్పటి వరకు ఎంతో మంచిగా
ప్రాణానికి ప్రాణాంగా ఉన్న Partners
మధ్య సత్సంబంధాలు సన్నగిల్లడానికి
కారణం ఒక్కటే వారిలో ఒకరిని
ఏదో ఒక దుష్టశక్తి ఆవరించడం
ఎవేవో చెత్త సలహాలు ఇవ్వడం
ఆపై అత్యాశ పుట్టడం
అంతా తనకే చెందాలనుకోవడం
దొరికినంత దోచుకోవడం
బ్యాంకులో దాచుకోవడం దానితో
ఒకరంటే ఒకరికి పడకపోవడం
విద్వేషాలు పెరిగిపోవడం
ప్రాణమిత్రులే ప్రత్యర్ధులై
బద్ధశత్రువులై పోవడం
కిడ్నాపులు చేసుకోవడం
కత్తులతో పోడుచుకోవడం
గన్నులతో కాల్చుకోవడం
గొడ్డళ్ళతో నరుక్కోవడం
జరుగుతుంది అన్నింటికి కారణం
ఆశబోతుతనమే అబద్దాలు ఆడడమే
మాయమాటలు చెప్పడమే
నిన్నఅన్నమాట నేడు తప్పడమే
అందువల్లనే అపార్ధాల అగ్నిపుట్టి
భాగస్వామ్యం భగ్గుమంటుంది
గుంటనక్కలకు గుణపాఠం నేర్పుతుంది



