అందుకే
అతిగా ఆలోచించకూడదు
ఆలస్యం చేయకూడదు
ఖచ్చితంగా ఒక ఆదివారం
సైట్ విజిట్ చెయ్యాలి
నచ్చిన ఒక ప్లాట్
తక్షణమే బుక్ చేసుకోవాలి
బయానా కట్టి బ్లాక్ చేసుకోవాలి
ఎందుకంటే
ఆలస్యం చేస్తే రేపు ఈ రేట్లు వుండవు
ఇష్టపడిన ఆ ప్లాట్లు వుండవు
కష్టపడి తిరిగి ప్రయోజనం వుండదు
ఔను కొందరు
ఎన్ని మంచి మాటలు
చెప్పినా వినరు
ఎన్ని మంచి మెసేజెస్
పంపినా చూడరు
చూసినా చదవరు
చదివినా స్పందించరు
ఎన్ని సార్లు కాల్స్ చేసినా, ఫోన్
ఎన్ని సార్లు రింగౌతున్నా లిఫ్ట్ చెయ్యరు
లిఫ్ట్ చేసినా తాడోపేడో తేల్చరు
ఏ డిసెషన్ తీసుకున్నారో అసలు
ప్లాటు కొంటారో కొనరో చెప్పరు
అట్టివారు ఎట్టివారోనంటూ
జుట్టు పీక్కుంటూ వుంటారు
సైట్ విజిట్ కోసం ఏ సీ కార్లు
ఏర్పాటు చేసి ఎంతో ఖర్చుపెట్టిన
మా మార్కెటింగ్ మేనేజర్లు
కారణం వారు
మునులో మూర్ఖులో తెలియదు
అమాయకులో అహంకారులో అర్థంకాదు
ఏదైనా అతిగా తింటే కక్కేస్తారు
ఎవరికైనా అతిగా చెబితే చేదైపోతుంది
అడగకుండా సలహాలు ఇవ్వడం కూడా
అవివేకమే అజ్ఞానమే అనవసరమే అమాయకత్వమే
వెనుకటికి ఓ వెర్రి వెంకన్న
ఎవరెస్టు శిఖరం ఎక్కడానికని
వెళ్ళి మెట్లులేవని తెలిసి
ఎలా ఎక్కాలో తెలియక
దిక్కులు చూస్తూ వుంటే
దారిన పోయే పామరులు అన్నారట
కాళ్ళు లేకున్నా మెట్లు లేకున్నా
ఎవరెస్టు శిఖరాన్ని లెక్కలేనంత మంది
ఎక్కేరన్నాఓ వెర్రి వెంకన్న అని
సుప్రభాత వేళ చక్కని
శుభసందేశాన్ని అందిస్తే
చదివి వెంటనే స్పందించిన వారి
ఇంట్లోకి ధనలక్ష్మి వచ్చి దాక్కుంటుంది
సుప్రభాత వేళ మంచి
శుభసందేశాన్ని అందిస్తే
చదివి సమయమున్నా స్పందించని వారి
ఇంట్లోకి దురదృష్టం వచ్చి దూరుతుంది
స్పందించకున్న నష్టం
స్పందిస్తే గొప్ప అదృష్టం
ఇది సుస్పష్టం ఇక మీ ఇష్టం



