తినేవాడికన్న,
తిని,కూర్చునేవాడికన్న
కూర్చొని వేళాపాల లేకుండా
సెల్ లో గేమ్స్ ఆడేవాడికన్న
లాప్ టాప్ లో ఇంగ్లీష్ సినిమాలు
టీవీలో చెత్త ప్రోగ్రామ్స్ చూసేవాడికన్న
పగటి పూట పనీపాటా లేకుండా
పడుకుని గురకలు పెట్టేవాడికన్న
జీవితంలో ఏదో ఒకటి సాధించి తీరాలన్న
కృషితో కసితో పగతో పట్టుదలతో
దృఢమైన దీక్షతో ఒక తపనతో
నిత్యం రగిలిపోతూ
ఒక గమ్యం
ఆ గమ్యం చేరాలన్న ఒక లక్ష్యంతో
ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్డంకులు
ఎన్ని అవరోధాలు ఎదురైనా
ఎన్ని సమస్యలు సవాళ్లు వచ్చినా
ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా
చేయూత నివ్వకపోగా
సహాయం చెయ్యకపోగా
ఎందరు ఎంతగా నిరాశ పరచినా
ఎంతగా వెనక్కి లాగినా
ఎన్ని విమర్శలు చేసినా
భయపడక బాణంలా ముందుకు
దూసుకు పోయినవాడే
అగ్ని కణంలా మండేవాడే
పులిలా ధైర్యంగా వుండేవాడే
బయట తలెత్తుకు తిరిగేవాడే భాగ్యవంతుడు
గదిలో గబ్బిలంలా కూర్చునేకన్న
బయట గాడిదలా బట్టలు మోయడం
రేసులో గుర్రంలా పరుగులు తీయడం మిన్న
కంటికి కొత్తవారు కనిపిస్తే కరవని
ఇంటికి రాత్రి దొంగలు వేస్తే మొరగని కుక్కకన్న
యజమానిపై విశ్వాసం వున్న కుక్కమిన్న



