నవ్వండి నలుగురికి నవ్వులు పంచండి
నువ్వేవారి చుట్టే నలుగురుంటారండి
నవ్వేవారికి అందరూ మిత్రులేనండి
నవ్వనివారి చుట్టుఎవ్వరూ వుండరండి
నవ్వనివారికి ఊరంతా శత్రువులేనండి
నవ్వేవారు ఎదురైతే గౌరవిస్తారండి
నవ్వుతూ నమస్కారం చేస్తారండి
ఏడుపుగొట్టు మొఖాలు ఎదురైతే
అందరూ ఏవగించుకుంటారండి
నవ్వితే నలుగురిలో నవ్వాలండి
ఏడిస్తే ఏకాంతంలో ఏడవాలండి
రాజులమంటూ ఫోజుపెట్టరాదండి
నరరూపరాక్షసుల్లా నవ్వరాదండి
నడిరోడ్డు మీద విరగబడి కాని
క్రిందపడినవారిని ఓడిపోయినవారిని
కష్టాలలో వున్నవారిని చూసి కాని
వెకిలిగా ఎప్పుడూ నవ్వరాదండి
మాడిపోయిన నల్లని మొఖంతో
నడివీధిలో ఎప్పుడూ నడువరాదండి
నల్లని మొఖమైనా,మాడిన మొఖమైనా
ఏడ్చే ఏమొఖమైనా,అది అంటువ్యాధేనండి
వెలిగే దీపం మరోదీపాన్ని వెలిగించినట్లు
నువ్వే ముఖమే నాలుగు ముఖాలలో
నువ్వును పుట్టించి కాంతివంతం చేస్తుందండి
ఎదుటివారిలోకి కనిపించని అనంతశక్తిని
ప్రవహింప చేసి ప్రకంపనాలు పుట్టిస్తుందండి
నవ్వేవారికి ఆరోగ్యం ఆయుస్సు రెండూ వరాలేనండి
ఏడ్చేవారికెప్పుడూ వ్యాధులు బాధలు వేదనలేనండి
నువ్వేవారికి స్వర్గం స్వాగతం పలుకుతుందండి
నవ్వునివారిని నరకం నవ్వుతూ రమ్మంటుందండి



