Facebook Twitter
కష్టేఫలి కాదంటారా? ఔనంటారా ?

దిగితేనే మీకు లోతు తెలిసేది
మాట్లాడితేనే ఎవరిమనసులో ఏముందో తెలిసేది

వెతికితేనే మీకు నిధులు దొరికేది
అడిగితేనే మీకు వివరాలు అందేది

ప్రయత్నిస్తేనే మీకు ఫలితం దక్కేది
పోరాడితేనే మీకు విజయం చిక్కేది

తడితేనే ఇంటి  తలుపులు మీకు తెరుచుకునేది 
రాయి విసిరితేనే చెట్టునుండి మీకు పండురాలేది

తేనెటీగల్ని తరిమితేనే మీకు తేనె దొరికేది
నేలలో విత్తనాలు నాటితేనే మొక్కలు పెరిగేది

కమ్మని పెద్దపెద్ద కలలు కంటేనే,
నిరంతరం శ్రమిస్తేనే, సాధన చేస్తేనే
గొప్పగొప్ప విజయాలు మీరు సాధించేది.    

మీ మనసులో ఆనందం కోసమే
మీ హృదయంలో తృప్తి కోసమే
మీ ముఖాలలో చిరునవ్వు కోసమే

మీ శ్రేయస్సు కోసమే మీ సుఖశాంతుల కోసమే
మీ జీవితంలో ప్రశాంతత కోసమే
కవి పోలయ్య ఇలాంటి కమ్మని కవితలు వ్రాసేది