Facebook Twitter
మీరు పరమ పిసనారులా? పరమాత్మస్వరూపులా?

పుచ్చుకోవడం తప్ప
ఇచ్చే గుణం లేని వాణ్ణి
ఈశ్వరుడు కూడా మెచ్చడు

ఇతరులకు ఇవ్వడం తప్ప
పరులనుండి పుచ్చుకోవడం

ఎరుగనివాడే పరమాత్మస్వరూపుడు

పిల్లికి భిక్షం పెట్టని పిసనారులారా!
పిడికెడు గింజలు చల్లినచాలునే
ఎన్నో పిట్టల పొట్టలు నిండును గదా

నేడు పేదలకు ఇష్టంతో ఇచ్చువారు రేపు
పుష్కలంగా పరమాత్మ నుండి పుచ్చుకుంటారు

పిసనారులు పిరికిపందలు
కలకాలం బ్రతికి లాభమేమి కాకుల్లాగ
దాతలుగా ధన్యజీవులుగా ఒక్కరోజు 
బ్రతికిన చాలు హాయిగా హంసల్లాగ

ఊరినుండి చాలా మీరు తీసుకున్నారు తిరిగి
ఇవ్వకపోతే లావెక్కిపోతారు శ్రీమంతుడి ఆలోచన

అలాగే ఈ సమాజంనుండి 
మీరు చాలా తీసుకున్నారు
తిరిగి ఇవ్వకపోతే
తీవ్రంగా నష్టపోతారు
కష్టజీవి ఆవేదన

అందుకే
అనాధల ఆకలి అక్కర్లు తీర్చండి
ఆపదలో వున్నవారిని ఆదుకోండి
చిరునవ్వుతో ఇవ్వండి
చిరకాలం జీవించండి

ఇక ఇప్పుడు తేల్చుకోండి మీరు
పరమ పిసనారులా? పరమాత్మస్వరూపులా?