వద్దురా వద్దురా నమ్మొద్దురా
కల్లబొల్లి కబుర్లు తియ్యగా
కాకమ్మకథలు కమ్మగా చెప్పి
నమ్మించి నవ్వుతూ నట్టేటముంచే
నయవంచకులను కంత్రీగాళ్ళను
వద్దురా వద్దురా నమ్మొద్దురా
కంటబడగానే పెంటమీద పైసాసైతం
పరుగెత్తికెళ్ళి తీసి దాచుకునే నీచులను
పిల్లికిగాని దానిపిల్లకుగాని
పిడికెడు బిక్షంపెట్టని పిసనారులను
వద్దురా వద్దురా నమ్మొద్దురా
అన్నాతమ్ముళ్లను అమ్మానాన్నలను
అక్కాచెల్లెళ్లను దూరపుబంధువులను
ఇంటికి పిలిచి ప్రేమతో ఇంత తిండిపెట్టి
గుట్టుగా లెక్కలు వ్రాసుకునే
గుంటనక్కలను ఆశబోతులను
వద్దురా వద్దురా నమ్మొద్దురా
మీ ఇంటికి వస్తే ఏమిఇస్తావు
మా ఇంటికివస్తే ఏమితెస్తావు
అన్నసూత్రాన్ని తూ.చ.తప్పక
పాటించే పరమదరిద్రులను దౌర్భాగ్యులను
వద్దురా వద్దురా నమ్మొద్దురా...



