విలేకర్ల"స్వేదబిందువులే"
అవిగో అవిగో...
మ్రోగుతున్నాయి "గుడిలోగంటలు"
రెండు మనసులు ఒక్కటైనందుకు
రెండు కుటుంబాలు కలిసిపోయినందుకు
రెండుజంటలేకమైనందుకు ఒకలోకమైనందుకు
అవిగో అవిగో...
పండుతున్నాయి "పచ్చని పంటలు"
రేయింబవళ్ళు రైతులు కష్టపడినందుకు
రక్తాన్ని చెమట చుక్కలుగా మార్చినందుకు
రెక్కలుముక్కలు చేసి సేద్యము చేసినందుకు
అవిగో అవిగో...
మండుతున్నాయి "ఆకలిమంటలు"
రైతుల పంటలకు గిట్టుబాటు ధరల్లేనందుకు
వలసకూలీలకు కనీసవేతనాలు కరువైనందుకు
కార్మికులు,శ్రామికులు ఉపాధికోల్పోయినందుకు
అదిగో అవిగో...
రాత్రికిరాత్రే విలేకరులందరి "స్వేదబిందువులే"
రంగు రంగుల వార్తలై, వేయి ఇంద్ర ధనుస్సులై
విజ్ఞానపు వెండివెలుగుల్ని విరజిమ్ముతున్నాయి
ఊపిరులూదే ఉషోదయ అరుణోదయ అక్షర కిరణాలై



