9 నెలలు...9 గంటలు...9 సెకండ్లు
కొందరు మిత్రులకిచ్చిన కవితాసందేశాలు
చిల్లికుండలో పోసినట్టి పాలైపోతున్నాయి
చదివి,సమయమున్నా స్పందించకున్నారు
తమ ఆనందాన్ని షేర్ చేయలేకపోతున్నారు
నీరుపోస్తేనేగా ఏ మొక్కైనా ఎదిగేది
తల్లిపాలు పడితేనేగా ఏ బిడ్డైనా పెరిగేది
కాస్త మెచ్చుకోలు, ప్రోత్సాహం వుంటేనేగా
ఏ కలమైనా కదిలేది, ఏకవితైనా కళ్ళు తెరిచేది
కాస్త ప్రోత్సాహిస్తే ఖర్చేముంది? చెప్పండి
కొన్ని కలాలకు ఆక్సిజన్ అందడం తప్ప
ఆకలితోవున్న అనాధలకు అన్నం పెడితే
పోయేదేముంది? ఇంత పుణ్యం రావడంతప్ప
ఒక బిడ్డ పుట్టడానికి ఓ తల్లిపడే ప్రసవవేదన "9 నెలలు"
ఒక చక్కని కవితను కనడానికి కవికి కావాలి "9 గంటలు"
కానీ,చదివి ఆపైస్పందించడానికి చాలుమీకు "9 సెకండ్లు"
స్పందన, అభినందనే "నిజమైన స్నేహానికి నిలువుటద్దం"



