Facebook Twitter
అదీ టైం దొరికినప్పుడు మాత్రమే 

ప్రతి మనిషికి
ఆలోచించే జ్ఞానముంది
చదివిందేదైనా నచ్చిందో లేదో
తేల్చేందుకు స్వేచ్ఛ వుంది
చెప్పేందుకు చేతిలో సెల్ వుంది
స్పందించేందుకు మంచి మనసుంది 
వ్రాసేందుకు అమృత హస్తముంది 
(అదీ టైం దొరికినప్పుడు మాత్రమే) 

మరి ఎంత మొరపెట్టుకున్నా దీవించకుంటే 
శివుడికి శిలకు తేడా ఏముంది? 
మనసుకు నచ్చిన 
ఒక మంచి సందేశం 
చూసినా చదవినా 
ఉలుకు పలుకులేకుంటే 
కాసింతైనా స్పందించకుంటే 
మనిషికి మానుకు తేడా ఏముంది? 
(అదీ టైం దొరికినప్పుడు మాత్రమే) 

అందుకే నచ్చితే
ఆనందంతో అరవండి 
నచ్చకున్న కామెంట్లతో గుచ్చండి
సరదాగా ఉరమండి మెల్లగా మెరవండి 
సలహాలు కురవనివ్వండి
విమర్శల వెల్లువలోనో
ప్రశంసల చిరు జల్లుల్లోనో తడవనివ్వండి
(అదీ టైం దొరికిన  లాప్పుడు మాత్రమే)

అందుకే మిత్రులారా మరవకండి
కామెంట్లతో చెత్త సందేశాలను 
కత్తెరించండి
లైకులతో కొత్త ఊహలకు 
ఊపిరి పొయ్యండి
మౌనంగా మాత్రం వుండకండి 
(అదీ టైం దొరికినప్పుడు మాత్రమే)