Facebook Twitter
కత్తికన్న కలమే మిన్న 

కవులు కరుణామయులు

ఎవరిలోనైనా ఏదైనా ఒక "మంచిలక్షణం"...

కంటబడితే చాలు మహాత్ములంటారు  

మహారాజులంటారు మణిదీపాలంటారు

ఇంద్రులంటారు శ్రీరామచంద్రులంటారు

పొగడ్తల పుష్పాలతో ముంచెత్తుతారు 

 

రవి కాంచనిచోట కవి కాంచునంటారు ఔను

కవులు మండే‌భాస్కరులని గుర్తుంచుకోండి 

ఎవరిలోనైనా ఏదైనా ఒక "అవలక్షణం"...

కంటికి కనిపిస్తే చాలు చెవులకు వినిపిస్తే చాలు

 

కరుకైన కత్తిలాంటి కవితలతో గుట్టుగా

గుండెల్లో గునపంలా గుచ్చుతారు

దారితప్పిన మనిషి మారే వరకు ఆ మనిషిలో

మంచితనం మానవత్వం వికసించే వరకు

 

కొందరు కంటిచూపుతో చంపేసినట్టు

కవులు కవితలతో కలం కత్తితో‌ చంపేస్తారు 

అందుకే కవులతో పెట్టుకోకండి,కత్తికంటే 

కలమే మిన్నన్ననిజాన్ని కలనైనా మరువకండి

 

కానీ ఓ పట్టు శాలువ కప్పేసి

చేతిలో ఓ చక్కని మెమొంటో 

ఓ ప్రశంసా పత్రం పెట్టేసి

మెళ్ళో ఓ పూలమాలను వేసి

నాలుగు పొగడ్తలతో ముంచెత్తితే చాలు

కత్తిలాంటికవి ఇట్టే కొవ్వొత్తిలా కరిగిపోతాడు

పాపం అదే కవుల బలం అదే కవుల బలహీనత