Facebook Twitter
ధనంకాదు ముఖ్యం గుణం...

ఓసీ కరోనా రాక్షసీ !

మేమెవరమో తెలుసా?

సృష్టికి ప్రతిసృష్టి చేసే

విశ్వామిత్రులం...

మానేల వేల ఉపద్రవాలను

తట్టుకున్న వేదభూమి

బెదిరించే విషపురుగు

గుండెల్లో నిదురించడం

మాకు వెన్నతో పెట్టిన విద్య

 

ఓసీ కరోనా రాక్షసీ !

మేమెవరో తెలుసా ?

రామభక్తులం...

రామబాణాలనే

రక్షణ కవచంగా ధరించినవాళ్ళం...

మాతోయుద్దానికి దిగకు ఓడిపోతావు

 

ఓసీ కరోనా రాక్షసీ 

మేమెవరో తెలుసా‌ 

మండేసూర్యులం‌...

మాతో పెట్టుకోకు

మమ్ము ముట్టుకోకు మాడిపోతావు

 

ఓసీ కరోనా రాక్షసీ !

సర్వం బంద్ చేసి అందరినీ

ఇళ్ళల్లో బంధీలను చేసి

కాలసర్పమల్లే కరాళనృత్యం 

చేసేందుకు....

చాటుమాటుగా కాటు 

వేసేందుకు... "మళ్ళీ వస్తే"

 

నీ విషపు కోరలు విరిచేస్తాం

నిన్ను తరిమి తరిమి కొడతాం

నీకు అతిత్వరలో 

"హ్యాపీ డెత్ డే"చెబుతాం

సెల్ఫ్ లాక్ డౌన్ తో...

సోషియల్ డిస్టెన్స్ తో...

స్వీయ నియంత్రణతో...

వ్యక్తిగత శుభ్రతతో..

మాస్కులనే..మారణాయుధాలతో.....