Facebook Twitter
ముక్కోటి దేవతలకు మ్రొక్కుదాం.

మూతపడ్డాయి,మూతపడ్డాయి

కరోనాతో అన్నీ మూతపడ్డాయి

విద్యాలయాలు,వినోదకేంద్రాలు, 

సినిమా హాల్స్, షాపింగ్ మాల్స్

హోటళ్ళు, రెస్టారెంట్లు, బార్లు,

బస్సులు, రైళ్ళు, విమానాలు, 

సముద్రంలో షిప్పులు,కిరాణా షాపులు 

గుళ్ళు గోపురాలు, చర్చీలు మసీదులు,

 

కాని,మూతపడక తెరుసుకున్నవి, 

మూడే మాత్రమే...

బ్యాంకులు, హాస్పిటల్స్, 

స్మశానంలో సమాధులు 

 

కొందరు ఇళ్ళల్లో ఏసీ గదుల్లో 

కంటినిండా నిద్ర పోతుంటే

కోరిన రుచికరమైన వంటలు చేసుకుని 

కడుపు నిండా తింటూ వుంటే

కంటికి నిద్ర రాక,కడుపునిండా తిండి లేక

ఉద్యోగమే తమ ఊపిరంటూ

సరిహద్దుల్లో నిరంతరం నిఘాపెట్టి

కాపలా కాస్తూ శతృసైన్యాలనుండి

ఉగ్రవాదులనుండి,

తమ ప్రాణాలను ఫణంగా పెట్టి

మన ప్రాణాలను కాపాడే ,యుద్దవీరుల్లా

 

కరోనా తరుముకుంటూ వస్తుంటే 

కాపాడమని ఎన్ని గుళ్ళు గోపురాలకు, 

ఎన్ని చర్చీలకు, మసీదులకెళ్ళినా 

అన్నీ మూతపడివున్నాయి, 

లాక్ డౌన్ లో తాళాలు వేసివున్నాయి

 

ఇక కాపాడే దిక్కులేక 

హాస్పిటల్ కొచ్చి పడ్డారు కరోనా రోగులంత

బోర్డర్ లో సైనికులకన్న మిన్నగా

కళ్ళముందే కరోనా మృత్యువున్నా

భయపడక, కరోనా రోగులందరికి

నిద్రాహారాలుమాని,నిర్భయంగా,నిస్వార్థంగా 

సేవలందిస్తున్న డాక్టర్లకు, నర్సులకు

పోలీసు సిబ్బందికి, పారిశుద్ధ్య కార్మికులకు

 

మనం, ఏమిచ్చి వారి ఋణం తీర్చుకోగలం

వారికి వందనం, పాదాభివందనం చేయడం తప్ప.

వారిపై పూలవర్షం కురిపించి "శతమానం భవతీ" అని 

దీవించి, ముక్కోటి దేవతలకు చేతులెత్తి మొక్కడం తప్ప.