Facebook Twitter
నా నమస్కారం వాడి సంస్కారం

రాజు నేను రోజు పార్కులో కలుస్తాం
పాత మిత్రులం. వాడు నా కంటే కాస్త పెద్ద అందుకే పార్కులో వాడు కనబడగానే  ప్రతి రోజు వాడికి నేనే ముందు నమస్కారం చేస్తాను కాని వాడు ప్రతి నమస్కారం చేయకుండా ఒక చిరునవ్వు నవ్వుతాడు అంతే. అదే నాకు నచ్చదు కోపం వస్తుంది కూడా

ఐతే "నమస్కారం చేస్తే తిరిగి ప్రతి నమస్కారం చేయకపోవడం సంస్కారం కాదు" అని తెలియని వాడేమీ కాదు వాడు

అదే విషయమై ఒకరోజు వాన్ని నిలదీశాను మళ్లీ అదే నవ్వు నవ్వి
"నాకు నమస్కారం పెట్టిన వారికి తిరిగి నేను నమస్కారం పెట్టనురా" అన్నాడు

అది వినేసరికి నా తల తిరిగింది. ఖంగుతిన్న నేను ఇకవీడికి జీవితంలో నమస్కారం చెయ్యకూడదు అని గట్టిగా నిర్ణయించుకున్నాను

ఎందుకురా ?అంటూ గట్టిగా ప్రశ్నించాను
మళ్ళీ అదే చిరునవ్వు నవ్వి
నాకు నమస్కారం చేసిన వారికి తిరిగి నేను నమస్కారం చెయ్యను కాని వెంటనే "ఓ గాడ్  బ్లస్ దెమ్&గివ్ దెమ్ లాంగ్ లైఫ్" అని మనసులో భగవంతున్ని వారి కోసం ప్రార్ధిస్తాను వారిని మనసారా దీవిస్తాను అన్నాడు అంతే.

నానోట మరోమాట రాలేదు అప్పుడు అనిపించింది ఇలాంటి ఒక సంస్కారికి ఒకటి కాదు వంద నమస్కారాలు చేస్తే మాత్రం నష్టమేముంది? అని అయితే నాశ్రేయస్సును కోరే నా మిత్రుణ్ణి నేను పూర్తిగా అర్థం చేసుకోలేక పోయినందుకు అపార్థం చేసుకున్నందుకు మనసులో కాస్త మదనపడ్డాను

ఆనాటి నుండి వాడు కనిపించిన ప్రతిసారి మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తూనే వున్నాను వాడి ఆశిస్సులకోసం ఆ దేవుని దీవెనల కోసం
.