ఒద్దురా వొద్దురా
ఒడ్డు చేరని నావ బ్రతుకు
గడ్డితినే గాడిద బ్రతుకు
ఒద్దురా వొద్దురా
బావిలో కప్ప బ్రతుకు
యెడారిలో ఒంటె బ్రతుకు
ఒద్దురా వొద్దురా
పంజరంలో పక్షి బ్రతుకు
కలుగులో కప్ప బ్రతుకు
ఒద్దురా వొద్దురా
పరిగెత్తలేని గుడ్డి గుర్రం బ్రతుకు
నట్టేట ముంచే మట్టేనుగు బ్రతుకు
ఒద్దురా వొద్దురా
వీధిలో కుక్క బ్రతుకు
ఆకలి తీరని అనాధ బ్రతుకు
ఒద్దురా వద్దు ఆ చెత్త బ్రతుకు
బ్రతికితే బ్రతకరా ఓ కొత్త బ్రతుకు
బ్రతికితే నిప్పులా బ్రతకాలిరా
నలుగురికి నీడ నివ్వాలిరా
బ్రతికితే అడవిలో
పులిలా బ్రతకాలిరా
రారాజులా అస్తమించాలిరా
బ్రతికితే మంచిగా బ్రతకాలిరా మహాత్ముడిలా మరణించాలిరా
జన్మకు సార్ధకతలేని
ఈ బ్రతుకులెందుకురా ?
వెలిగించినా వెలుగునివ్వని
ఆ నూనెలేని దీపాలెందుకురా?
మరి మీ పుట్టుకకు
అర్థం పరమార్థ మేముందో
ఒక్కసారి అందరు ఆలోచించండి
అసలు లోపమెక్కడుందో



