Facebook Twitter
ఉంటే చాలు ప్రేమించే మనస్తత్వం ఆదుకోవాలన్న ఉన్నతమైన వ్యక్తిత్వం !

ఎక్కువ జబ్బులు పేదలకే
ఎక్కువ ఖర్చులు పేదలకే
ఎక్కువ అప్పులు పేదలకే
అన్నింటికీ కారణం
అస్తవ్యస్థమైన వారి ఆర్థికస్థితే

అందుకే లోతైన లోయలో నుండి
ఎత్తైన పర్వత శిఖరం పైకి చేరడం
సాధ్యమా? సాధ్యమే ఎలా?
దైవానుగ్రహమంటూ వుంటే

అది సాధ్యమా?సాధ్యమే ఎలా?
భక్తితో భగవంతుని నామాన్ని జపిస్తే
ఆయనకై నిరంతరం తపిస్తే

అది సాధ్యమా?సాధ్యమే ఎలా?
నీకు నిత్యం ఎదురౌతున్న
అనేకమంది అనాధలను ఆదరించడం
నిరుపేదలకు నీడనివ్వడం
వారిఆకలిని తీర్చడం ఆశలను నెరవేర్చడం

అది సాధ్యమా?సాధ్యమే ఎలా?
ఉంటే చాలు
ప్రతి వారిని ప్రేమించే మనస్తత్వం
అందరినీ ఆదుకోవాలన్న ఉన్నతమైన వ్యక్తిత్వం