Facebook Twitter
మా స్నేహం శాశ్వతం....

వాడు నేను నిజానికి
ఒక తల్లి కడుపున పుట్టకపోయినా
మిత్రుల్లా కాక సొంత అన్నాదమ్ముల్లా వున్నాం

వాడు నన్ను కాని నేను వాన్ని కాని
తిట్టిన, ఎగతాళిగా మాట్లాడిన,
చాటుమాటుగా విమర్శించిన దాఖలాలు లేవు

వాడు నన్ను కాని నేను వాన్ని కాని
ఎవరిముందైనా ఎప్పుడైనా ఎక్కడైనా
కించపరచి మాట్లాడినట్లు దాఖలాలు లేవు

వాడు నన్ను కాని నేను వాన్ని కాని
ఏ నాడు ఎంతో ఇబ్బందిలో వున్నా కూడా
ఇంత డబ్బు ఇవ్వమని, సర్దమని, సహాయం చేయమని అడిగిన దాఖలాలు లేవు

మామధ్య ఎలాంటి కోపతాపాలు లేవు
మనస్పర్థలు లేవు మాట్లాడుకోకుండా ఇద్దరం
మౌనవ్రతం దాల్చిన దాఖలాలు లేవు

ఈ 40సంవత్సరాల మా 
సుదీర్ఘ  ప్రయాణంలో మేము
స్నేహానికి చిరునామాలయ్యాము
త్యాగానికి ప్రతిరూపాలయ్యాము
మా స్నేహం శాశ్వతం ఎందరికో మేము ఆదర్శం