Facebook Twitter
నిన్న అన్నమాట మీద నిలబడరు …

ఆలస్యం అమృతం విషం అంటారు
ఆలస్యం ఆనందం విషాదం అంటారు

ఆలస్యం చేస్తే అమృతం కన్నా విషమే ఎక్కువ
ఆలస్యం చేస్తే ఆనందం కన్నా విషాదమే ఎక్కువ

ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్దీ
ఆలోచనలు విషతుల్యమై పోతాయి
విషతుల్యమై పోతే‌ మిగిలేది విషాదమేగా

మనసులు విషాదమయమైపోతే
మనుషులు కూడా మారిపోతారు

మారిన మనుషులు వెంటనే మాట మారుస్తారు
అట్టివారు నిన్న అన్నమాట మీద నిలబడరు

కట్టుకథలు అల్లుతారు
సైలెంట్ గా దారి మళ్ళుతారు
మన ఆశలమీద నీళ్ళు చల్లుతారు

ముసలిలా కన్నీళ్లు కారుస్తారు
ముందరి కాళ్ళకు బందాలు వేస్తారు