అప్పులు ...అవసరాలు…
అప్పు నిప్పుని
అప్పు చేయడం తప్పని
చేసిన అప్పు తీర్చకపోతే పెనుముప్పుని
ఎందరు ఎన్నిచెప్పినా అప్పుచేయక తప్పదు
ఎప్పుడు? వచ్చే ఆదాయంకంటే
అనవసరపు ఖర్చులు ఎక్కువైనప్పుడు ఆదాయమున్నా ఒక్కపైసా కూడా
పొదుపు చేయనప్పుడు
అనుకోని అవసరాలు ఆకస్మికంగా వచ్చినప్పుడు
అప్పు చేయక తప్పదు
అడ్డమైనవారి గడ్డాలు చేతులు కాళ్లు
పట్టుకోక తప్పదు అడగక తప్పదు
అవసరమైతే అడుక్కోక తప్పదు
అప్పుతీసుకోవడం కాదు తప్పు
ఆడినమాట తప్పడం తప్పు
తీసుకున్నఅప్పు సకాలంలో చెల్లించకపోవడం తప్పు
తప్పించుకొని తిరగడం తప్పు
అప్పుడిగితే ఇస్తాను ఇస్తాను అంటూ
ఇంటిచుట్టూ యిరవైసార్లు తిప్పుకోవడం తప్పు
అట్టివారికి సంఘంలో విలువ వుండదు
అవసరాలు వచ్చినప్పుడు వారు అప్పుపుట్టక
గట్టుమీదపడిన చేపలా గిలగిలా కొట్టుకుంటారు



