ఎక్కడ..? ఎక్కడ..?
ఎక్కడ...
స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు...
రెక్కలు కట్టుకుని
"విహంగాలై" విహరిస్తున్నాయో...
ఎక్కడ...
సమన్యాయం ...
"చల్లని వెన్నెలై" కురుస్తున్నదో...
ఎక్కడ...
సమానత్వం...సౌభ్రాతృత్వం "మలయమారుతాలై" వీస్తున్నాయో...
ఎక్కడ...
మనిషి మనిషిలో
మంచితనం...మానవత్వం "సుగంధ పరిమళాలై" వెదజల్లబడుతున్నాయో...
అక్కడికి "సమతా భావాలతో"
అందరం ముందుకు సాగిపోదాం...
అక్కడే వెలసిన "మమతల కోవెలలో"
సమిష్టిగా"మధుర గీతాలను" ఆలపిద్దాం...



