Facebook Twitter
రాజ్యాధికారమే లక్ష్యంగా...!

నిన్న...
కాలినడకన సైకిళ్ళ మీద తిరిగిన
గల్లీలోని చోటానాయకులు ఢిల్లీకెళ్ళి

రేపు
కాలం కలిసి వచ్చి కార్పోరేటర్లౌతారు
ఖద్దరు దుస్తుల్లో...ఖరీదైన కార్లలో
కాలరెగ రేసుకుంటూ తిరుగుతారు

నిన్న
ఆశపెట్టి అరచేతిలో స్వర్గం చూపి
మీ జేబులో ఒక వంద కొట్టి
మీ చేతిలో ఒక బిర్యానీ ప్యాకెట్ పెట్టి
మీ నోట్లో ఇంత మత్తుమందు పోస్తే

రేపు
మీకు తెలియదు
మీనోట్లో మట్టికొట్టారని...
కోట్లు పోసి మీ ఓట్లు కొన్నారని...
మీ ఆశలకు తూట్లు పొడిచినారని...
మిమ్మల్ని మత్తులో ముంచి మాయలో దించి
మీ ఓటువిలువ మీకు తెలియకుండా చేశారని...

ఓ పీడిత తాడిత బడుగు
బలహీనులారా ! బహుజనులారా !
ఇంకెంతకాలం మీరిలా బానిసలై బ్రతుకుతారు ?

ఓట్లు మీవి...సీట్లు వారివా ?
అజ్ఞానం మీది...అధికారం వారిదా ?
పాలితులు మీరు...పాలకులు వారా ?
85 శాతం మీద...15 శాతం పెత్తనమా?

అందుకే ఇకనైనా కళ్లు తెరవాలి
ఒక బలమైన సంఘటిత శక్తిగా అవతరించాలి !
ప్రతిదీ ప్రశ్నించాలి... ప్రతిఘటించాలి...పోరాడాలి !
రాజ్యాంగ బద్దంగా...రక్తతర్పణకైనా సిద్దపడాలి !

మీ "సఖ్యతను"...నిరూపించుకోవాలి ! నిప్పైరగలాలి !
మీ "ఐక్యతే" మీ ఉద్యమాలకు "ఊపిరి" కావాలి !

ఓ బహుజనులారా ! ఒక పచ్చినిజం తెలుసుకోండి !
సంఘంలో సమానత్వం... ఒక్కవిద్య ద్వారానే సాధ్యమని...
రాజ్యాధికారం మీకు...ఒక్క ఓటు ద్వారానే ఖాయమని