Facebook Twitter
శుభ శుభోదయం!

ఓ ప్రియ మిత్రులారా !

నా శ్రేయోభిలాషులారా !!

 

మీరు "నిద్ర" లేచింది మొదలు 

తిరిగి "నిద్ర" పోయేంత వరకు

 

మీ కలలన్నీ పండును గాక !

మీ కోరికలన్నీ తీరును గాక !

మీ ఆశలన్ని నెరవేరును గాక !

 

మీకన్నీ శుభాలే జరుగును గాక!

శుభసందేశాలే మీరు విందురుగాక !

 

మీ సకల సమస్యలకు పరిష్కారాలు 

మీ సందేహాలకు చక్కని సమాధానాలు

మీ చిక్కుప్రశ్నలకు జవాబులు చిక్కును గాక ! 

 

కనిపించని ఆ దైవం కరుణించి కాపాడును గాక!

ప్రశాంతమైన జీవితాన్ని మీకు ప్రసాధించును గాక !

మీరు తలపెట్టిన ప్రతికార్యము సఫలమగును గాక !

 

మీ ఇంట సిరిసంపదలు పొంగిపొరలును గాక !

మీ ముఖాలలో సుఖశాంతులు వెల్లివిరియును గాక !

మీ పెదవులపై చిరునవ్వులు చిందులు వేయును గాక !