దగాకోరుల మీద నిఘా...
చుట్టేమి
జరుగుతుందో
పట్టించుకోనివారికి
ముందుచూపు లేనివారికి
మంచిమాట చెబితే విననివారికి
మూర్ఖుల మాటల్ని శ్రద్ధగా వినేవారికీ
ముందన్నీ కష్టాలే...నష్టాలే
చింతలే...చిక్కులే...చీకాకులే...
కారణం చుట్టూవున్న
వారంతా మేక వన్యపులులని
బాగా నమ్మించి
నవ్వుతూ నట్టేటముంచే
నయవంచకులని నమ్మకద్రోహులని
కడుపులో
కత్తులుంచుకొని కౌగలించుకొనే
కసాయివాళ్ళని తేనెపూసినకత్తులని
ఘోరంగా నష్టపోయేంతవరకు
దారుణంగా మోసపోయేంతవరకు
చిట్టచివరి నిముషం వరకు
తెలుసుకోకపోతే ఎలా?
అజ్ఞానంలో మునిగివుంటే ఎలా?
అందుకే, మిత్రులారా!
ఇకనైనా నిజం తెలుసుకోండి !
గాఢనిద్ర నుండి మేల్కొనండి !
దగాకోరులమీద నిఘా పెట్టండి !
లేదంటే చెల్లించుకోక తప్పదే
కలలో సైతం ఊహించలేని
భరించలేని భారీ మూల్యం...కాస్త
దగాకోరులమీద నిఘా పెట్టకపోతే ఎలా?



