Facebook Twitter
ఆ మనసుకే ఎరుక...?

నిప్పుల్లో పడ్డ ఉప్పు
చిటపటలాడినట్లు

వేటగాని వలలో చిక్కిన
జింక విలవిలలాడినట్లు

గాలానికి చిక్కిన
చేప గిలగిలలాడినట్లు

మూడు వేడివేడి ఫ్లయింగ్
కిస్సులతో మూడు చెడిన
ఓ ప్రేమపిపాసి, ఓ కామపిశాచి

ప్రేయసీ పొందుకోసం తపించినట్లు
అన్ని అగ్నిపరీక్షలకు సిద్దమైనట్లు

తియ్యని ఊహలలో తేలిపోతూ
కమ్మని కలలతో కరిగిపోతూ

ఆరని ఆశలతో తీరని కోరికలతో
పగలు రేయి రగిలిపోతూ

మురిపించే, మైమరపించే,
మత్తెక్కించే,ఆ తాపం,ఆ విరహం
ఆ మోహం, ఆ మైకం
ఎవరికెరుక ఆ ఎర్రి మనసుకు తప్ప