వీరు పెట్టుబడి పెట్టగలరు
వీరు చాలా మంచివారు
వీరు కూడా నాలాగ
ఒక ప్లాటు కొనాలి బాగుపడాలి అని
మీరు అనుకుంటున్న మీ మిత్రులను
దయచేసి మాకు పరిచయం చేయగలరు
ఇది కళ్ళకు కనిపడని గొప్ప సహాయం
కానీ చేసిన మీరు వారికి కనిపించే దైవం
కలలో కూడా ఊహించని లాభాలే వస్తే
వారు మీ మేలు ఈ జన్మలో మరిచిపోరు
ఒక ఐడియా జీవితాన్నే మార్చివేస్తుంది
ఒక సెల్ నెంబర్ కోటీశ్వరులను చేస్తుంది
అందుకే మా మాట వినండి మీ మిత్రులను
పరిచయం చెయ్యండి మీరూ ఫలితం పొందండి
నా కవితలు
రుచికరమైన చక్కని వంటలు
నా కవితలు
బడిలో గుడిలో మ్రోగే గంటలు
నా కవితలు
కడుపులు నింపే పచ్చని పంటలు
నా కవితలు చదివిన చాలు
ఆరును మీ ఆకలి మంటలు
చేరును తీరం మీ జీవితనావలు
నా కవితల్లో ఆశ వుంది
ఒక ఆలోచన వుంది ఓ ఆశయముంది
నా కవితల్లో ఆపదలు వేస్తే
వెంటనే ఆదుకొనే ఓ ఆయుధముంది
నా కవితల్లో ప్రాణం పోసే ఆక్సిజన్ వుంది
ప్రాణంపోతే బ్రతికించే ఓ అమృతముంది
నా కవితల్లో సమాజంలోని
అన్ని రుగ్మతలకు ఓ దివ్యఔషధముంది
నా కవితలు చదివిన చాలు
మారును తప్పక మీ మనుగడలు
కురియును మీ బ్రతుకున తేనెలవానలు



