ఉంటే - ఉంటే - ఉంటే?
ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయి
ట్యాంక్ లో - నీళ్లు ఉంటే
స్విచ్ వేస్తే ఫ్యాన్ తిరుగుతుంది
లైటు వెలుగుతుంది - కరెంటు ఉంటే
మొండి రోగాలు సైతం నయమౌతాయి
రోజూ - మందులు వేసుకుంటే
కాపురంలో కలతలు కలహాలుండవు
ఇద్దరూ - కలిసి ఉంటే
ఇద్దరిలో - ఐక్యత సఖ్యతఉంటే
పశువులు చిక్కని పాలిస్తాయి
ప్రతిరోజు పచ్చగడ్డి - వేస్తూ వుంటే - మేస్తూ ఉంటే
విధిని ఎదిరించవచ్చు, విజయాన్ని
సాధించవచ్చు గుండెలో - దమ్ము ధైర్యముంటే
ఎట్టి క్లిష్ట పరిస్థితులనైనా ఎదుర్కొనవచ్చు
ఆత్మవిశ్వాసం - అధికంగా ఉంటే
ఎట్టి పోటీ పరీక్షనైనా పాస్ కావచ్చు
గట్టిగా, ప్రణాళికాబద్ధంగా, శ్రద్ధగా - చదివి ఉంటే
ఎన్ని బాధలనైనా, వేదనలనైనా
భరించవచ్చు భగవంతుడే - మనకు తోడుంటే



