అసహాయత నుండి ఆధారపడే ధోరణిలో నుంచి స్త్రీలు బయటపడాలి.ఏ చిన్న కష్టం వచ్చినా ఒదిగిపోయి భోరున విలపించేదుకు మరో ఒడి కోసం ఎదురు చూడటం మానుకోవాలి .
మానసికంగా శక్తిమంతులై ఎంతటి విపత్కర పరిస్తితులైనా ఒంటరిగా ఎదుర్కోవాలి.
ఒకటీ రెండు గ్రామాలకు చేసిన సేవ, అక్కడ తయారైన పదీ ఇరవైమంది కార్యకర్తలు ఇవి చాలు.అవే అన్నటికీ నాశనం కానీ బీజంగా ఏర్పడతాయి.
వీటి నుంచే కాలక్రమేణా వేలకు వేలమంది ప్రజలు ప్రయోజనం పొందుతారు.
మనకిప్పుడు వందలకొద్దీ నక్కలతో పని లేదు.
సింహాలవంటి వాళ్లు ఆరుగురు చాలు.
వారితోనే మహత్తరమైన పనుల్ని సాధించవచ్చు."
పాశ్చాత్య దేశాల అద్భుతమైన జాతీయ జీవిత కట్టడాలు శీలం అనే పటిష్టమైన స్తంభాలను ఆధారం చేసుకొని నిర్మితమైనాయి
మానవుడికి మరణం లేదు, జననమూ లేదూ, దేహాలు నశిస్తాయి.కాని అతనికి మరణం లేదు.
మనం త్వరగా నిద్రలేచినంత మాత్రాన సూర్యుడు ముందుగా ఉదయించడు.
ప్రపంచంలోని వేల భాషలకు దీటైనది చిరునవ్వే. ఎందుకంటే అది పసికందు కూడా మాట్లాడగలిగిన భాష.
ఏదో సాధించాలన్న తపన మనసు లోతుల్లో జ్వలించకపోతే దేహం నిర్జీవమైపోతుంది. కాంక్ష మనసుకూ, శరీరానికీ జీవశక్తినిస్తుంది. కాంక్షే ఆవిరైపోతే అన్ని శక్తులు హరించుకుపోతాయి.
ఎక్కడ చూసిన ధీన నయనాలా ప్రశ్నలు మౌన విశ్వాసాల పిలుపులు
బావురుమనే గుండెల ఏడ్పులు బాధల సలసల కాగే బ్రతుకులే
చెయ్యి మనది కాకపోతే పాముని పట్టుకోవడం సులభం
అదృష్టం అందరి తలుపునూ తట్టవచ్చు కానీ ఆ తలుపు తీసే తెలివి ఆపిలుపు వినగలిగే నేర్పు కొందరికే ఉంటుందిమేల్కొన్నవారికి మేలు జరుగుతుంది
నిన్ను బాధించిన హృదయాన్ని ప్రేమించు, నిన్ను ప్రేమించే హృదయాన్ని బాధించకు.
నువ్వు ఉత్సాహంగా తిరుగుతూ ఉంటే దేశం మొత్తం నీ నేస్తమవుతుంది.కానీ నీవు ఎప్పుడూ పడుకుని ఉంటే మాత్రం నీ చాపే నిన్నుఏవగించుకుంటుంది.
కేలవం ఊహలతోనే కాలం గడిపితే ప్రయోజనం ఉండదు.
నారు పోసినట్లు ఊహించినంత మాత్రాన పంట పండుతుందా.?
జీవితం నవనీతం పాత్ర మీద పడనీకూ రాయినీ రప్పనీ పగులుతుంది స్వప్నం రగులుతుంది దుఖం.
మానవత్వాన్ని మించింది ఈ లోకంలో లేదు. మానవత్వం ఒక సముద్రం వంటిది. అందులో రెండు చుక్కల మలినం కలిసినంత మాత్రాన సముద్రమంతా చెడిపోదు.
- మహాత్మాగాంధీ.
ఏ ఆదర్శమూ లేని వ్యక్తి తెడ్డు లేని పడవ వంటి వాడు.
ఆరోగ్యమనేది గొప్ప బహుమతి. సంతృప్తి అనేది గొప్ప సంపద. నమ్మకం ఓ గొప్ప బంధం.
మన ఊహా శక్తి అసలు ఉనికే లేని ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్తుంది. ఊహ లేనిదే మనకు గమ్యమే లేదు.
గతం గురించి బాధతో, భవిష్యత్ గురించి భయంతో ఆలోచించకు. వర్తమానంలో జాగరూకతతో వ్యవహరించు చాలు
మానసికంగా శక్తిమంతులై ఎంతటి విపత్కర పరిస్తితులైనా ఒంటరిగా ఎదుర్కోవాలి.
‘చింత’కు ‘చితి’కీ తేడా సున్నా. చితి నిర్జీవులను కాలిస్తే చింత సజీవులనే దహించివేస్తుంది.
పేడ దిబ్బపై ప్రకాశించినా సూర్య కిరణాలు మాలిన్యం కానట్టే
దృఢ సంకల్పంతో ఉన్న వాడి మనసు ఎవరూ పాడు చేయలేరు.
- స్వామి వివేకానంద.
మనకు బంధువులనిచ్చేది భగవంతుడు. కాని
మిత్రులను చేసుకొనేది మాత్రం మనమే.
ప్రపంచంలోని ఏ మనిషైనా సంతోషాన్ని కోరుకుంటాడు తప్ప,
దుఃఖాన్ని కోరుకోడు. అయితే,
వర్షపు చినుకు లేకుండా ఇంద్రధనుస్సు రానట్టే,
కష్టాలు పడకుండా సంతోషం ఎప్పుడూ దొరకదు!
కన్నీరు చాలా విలువైనది.
ఎందుకంటే... కన్నీటి బిందువులో కేవలం ఒక్క శాతం మాత్రమే
నీరు ఉంటుంది.
మిగతా తొంభై తొమ్మిది శాతం ఫీలింగ్సే!
నువ్వు అందరితో మంచిగా ఉంటావు కాబట్టి అందరూ నీతో మంచిగా ఉండాలని కోరుకోవడం అమాయకత్వమే అవుతుంది. అలా కోరడం ఎలా ఉంటుందంటే... నేను నిన్ను తినను కాబట్టి నువ్వు కూడా నన్ను తినకు అని సింహాన్ని అడిగిన ట్టుంటుంది!
మనిషి జీవితం విచిత్రమైనది. యవ్వనంలో సమయం, శక్తి ఉంటాయి కానీ డబ్బు ఉండదు.
మధ్యవయసులో డబ్బు, శక్తి ఉంటాయి కానీ సమయం ఉండదు. వృద్ధాప్యంలో సమయం, డబ్బు ఉన్నా కష్టపడే శక్తి ఉండదు.
దేవుడా! రక్షించు నా దేశాన్ని పవిత్రులనుండి, పతివ్రతలనుండి,పెద్దమనుషులనుండి, పెద్దపులులనుండి.
నిన్ను ఎవరు ఏమన్నారన్నది కాదు ముఖ్యం . వారన్నదానికి నువ్వెలా రియాక్టయ్యావన్నది ముఖ్యం.
కొన్నిసార్లు తప్పుకుని వెళ్లిపోవడం కంటే, నిలబడి నవ్వడం మంచి ఫలితాన్నిస్తుంది!
ర్ధన యొక్క ఫలితం -నమ్మకం, నమ్మకం యొక్క ఫలితం -ప్రేమ, ప్రేమ యొక్క ఫలితం -సేవ, సేవ యొక్క ఫలితం -సంతృప్తి
కోపగించుకోవడం అంటే మనం విషం మింగి అవతలి వ్యక్తి మరణించాలని కోరుకోవడం లాంటిది.
విమర్శలకు భయపడకు, ఎదురుగాలిలోనే గాలిపటం పైకిలేస్తుంది
గతమంతా తోలుబొమ్మలాడిన ఒక తెర, వర్తమానం నీ కన్నుల గప్పిన ఒక పొర.
మాలిన్యం మనసులో వున్నా మల్లెపువ్వులా నవ్వడం ఈనాటి తెలివి
వాడని కిటికీ పెట్టి లాభం లేదు ఉపయోగపడని కొడుకు పుట్టి లాభం లేదు
అసాధ్యమైన దానిని ఆశించు, కనీసం అత్యుత్తమమైనదైనా అందుతుంది.
ద్య, వివేకం, పరిజ్హానం బావిలో నీళ్లు లాంటివి. అవి తరగని నిధులు. వాడుతున్న కొద్దీ ఊరుతూనే ఉంటాయి - జెఎం. క్లార్క్"



