నిజజీవిత నిత్యసత్యాలు అనుభవాల ఆణిముత్యాలు
కెరటం నీకు ఆదర్శం కావాలి
క్రింది పడిపోయినందుకు కాదు
పడినా తిరిగి పైకి లేచినందుకు
పోరాడు పోరాడితే పోయేదేముంది?
నీ బానిసబ్రతుకు బాగుపడడం తప్ప
లక్ష్యంలేని జీవితానికి విలువెక్కడిది?
అలలులేని కడలికి అందమెక్కడిది ?
వెయ్యకు...నిచ్చెన...ఆకాశానికి
మూసెయ్యకు...తలపుల్ని
ఆశకు... అవకాశాలకు...అదృష్టానికి
కమ్మని కలలు కను,కంటినిండా నిద్రపో, కాని
ఆ కలలు సాకారమయ్యేదాక కునుకుతియ్యకు
విజయం వస్తుంది, నీ ముందే నిలుస్తుంది
వీరులను,విజేతలనే విందుకు పిలుస్తుంది
మన భరతమాత గర్వించేలా...
నవసమాజాన్ని నిర్మించు...చరిత్రను సృష్టించు
ధృవతారగా వెలిగిపో....చిరంజీవిగా...మిగిలిపో



