మూగవేదన - అరణ్యరోదన
మీ ఆకలి ఆరనినాడు,
మీ ఆశలు తీరనినాడు
మీ కనులు కనలేనినాడు,
మీ చెవులు వినలేనినాడు,
మీ చేతిలో డబ్బులు లేనినాడు,
మీకు జబ్బులు ఎంతకూ పోనినాడు,
మిమ్ము ఆదరించే వారే కరువైననాడు,
ఇంటిలోఅందరికి, మీరు బరువైననాడు,
కాటికాడి కాకులు రమ్మంటుంటే,
కన్నబిడ్డలే కాటికి పొమ్మంటుంటే,
ఇంకా బ్రతుకు మీద ఆశ ఎందుకు ?
ఆ పరమేశ్వరునికి ఇలా ప్రార్ధన చేయండి
ఓ మా దైవమా ! ఓ మా తండ్రీ ! ఓ ప్రభూ !
వినండి మా ఆఖరి ప్రార్ధన, అరణ్య రోదన,
ఈ మూడుకాళ్ల ముసలివాళ్ళ,మూగ వేదన,
మేమిక్కడ ఎందరికో భారం,
నేడు మా బ్రతుకు బహు అంధకారం
మిమ్ము చేరేందుకు మాకు ఇంకెంత దూరం,
త్వరగా చేర్చండి తండ్రీ ! మమ్మల్ని ఆవలితీరం



