Facebook Twitter
కన్నవారి ప్రేమకన్న మిన్నఏముంది?

కోరిన సంతానం కలిగితే
సంతోషిస్తాం సంబరపడిపోతాం
సర్వం త్యాగంచేసి బిడ్డల్నిప్రయోజకుల్ని చేస్తాం

కాని ఆ కన్నబిడ్డలకే మనం భారమైనప్పుడు
బ్రతుకు అంధకారమైనప్పుడు ఊరికి దూరమైనప్పుడు

కడుపు మాడినప్పుడు కాటికి దగ్గరైననప్పుడు
కన్ను మూసినప్పుడు కట్టెగా మారినప్పుడు

కన్న తల్లిదండ్రులకు ఎంత ఘనంగా
కర్మకాండలు నిర్వహిచినా సరే
ఎంత ఖరీదైన నిగనిగలాడే
సమాధులు పాలరాతితో నిర్మించినా సరే

ఆ కన్నవాళ్ళు కార్చిన ఆ కన్నీటి చుక్కలు
వారు పెట్టిన ఆ ఆకలికేకలు
బిడ్డలకు శాశ్వతంగా తీరని శాపాలైతే ?

కానీ ఆ బిడ్డలమీద తల్లిదండ్రులు కురిపించే ప్రేమ
అందించే ఆఖరి దీవెనలే వారికి ఆరని దీపాలైతే ?

సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడే సందిగ్దంలో దగ్దమైపోడా !
బిడ్డల్ని శపించాలా ? లేక
దీర్ఘాయుష్మాన్ భవా ! అంటూ దీవించాలా?  అని...