Facebook Twitter
ఆరిపోయే దీపాలే....

అటు కన్నవాళ్ళ పై గౌరవంలేక
ఇటు కట్టుకున్న భర్తంటే భయంలేక
అటు కడుపున పుట్టిన బిడ్డలంటే
మమకారంలేక మాతృత్వం మాయమై
ఇటు అన్నాతమ్ముళ్ళు
అక్కాచెల్లెల్లంటే ప్రేమలేక
అటు బంధువుల బోధల్ని లెక్కచెయ్యక
ఇటు శ్రేయోభిలాసుల సూచనలు చెవికెక్కక

చెడిపోయిన స్నేహితుల
చెప్పుడు మాటల్నివింటూ
ఇచ్చే పిచ్చిసలహాల్ని పుచ్చుకుంటూ
సినిమాలంటూ షికార్లంటూ
సిగ్గులజ్జ లేకుండా
స్నేహితులంటూ షాపింగులంటూ
అచ్చోసిన ఆంబోతుల్లా అర్ధరాత్రివరకు
బరితెగించి బజార్లో తిరిగి తిరిగి ఇంటికి
అలసి సొలసి పోయివస్తూ వుంటారు
అమాయకంగా కొందరు అమ్మాయిలు

కారణం వారు పూర్తిగా
చెడిపోయైనా చెడిపోయి వుంటారు లేదా
"ప్రేమమాయలో"కాదుకాదు "ప్రేమలోయలో"
పడిపోయైనా పడిపోయి వుంటారు
ఆపై వారెవర్నీ లెక్కచెయ్యరు
ఏది వినరు ఏమి తినరు

ఒక్కటే ద్యాస నచ్చినోడితో ఫోనులో
పిచ్చిగా మాట్లాడడం పచ్చిగా తిరగడం
కన్నోళ్ళ కళ్ళల్లో కారం కొట్టడం
కట్టుకున్నోళ్ళను కడతేర్చడం
పిల్లలడ్డొస్తే పీక పిసికెయ్యడం
"కాలుజారితే" కన్నీళ్ళు పెట్టుకోవడం
పెళ్ళిచేసుకోమని కాళ్ళు పట్టుకోవడం
పెళ్ళిలేదు గిల్లీలేదంటే‌ ఫ్యాన్ కువ్రేలాడడం
ప్రాణాలు తీసుకోవడం, ముందున్న
బంగారు భవిష్యత్తును ముక్కలు చేసుకోవడం

ఇలా ప్రేమపిచ్చిపట్టిన ...తిరుగుబోతు...త్రాగుబోతు

పొగరుబోతు అమ్మాయిలందరూ నిజానికి ఆరిపోయేదీపాలే
అట్టివారిని కన్న అమ్మనాన్నలకు మిగిలేది పుట్టెడు దుఃఖమే