నాలుగు వింతజీవులు
ఈ ధరణిపై ఉన్నాయి నాలుగు వింతజీవులు
తరచిచూడ వీటి మనస్తత్వం బహు విచిత్రం
తాపట్టిన కుందేటికి
మూడేకాళ్ళని వాదించే "మూర్ఖుడొకడు
జీహాదీపేర కన్నవారిని కంటికి కనిపించిన
వారిని కడతేర్చే కరుడుగట్టిన "తీవ్రవాదొకడు"
అనుమానంతో భార్యను ఘోరాతిఘోరంగా
గృహహింసకు గురిచేసి ఆనందించే "శాడిస్టొకడు"
పగలురేయి హాయిగా ఆనందంగా పరమాందంగా
బురదగుంటల్లో పొర్లాడి దొర్లాడే "వరాహమొకటి"
కొండల్ని పిండిచేయవచ్చునేమో!
పర్వతాలను కూల్చవచ్చునేమో !
నింగిలోని చుక్కల్ని నేల రాల్చవచ్చునేమో!
సముద్రాలను రెండుపాయలుగా చీల్చవచ్చునేమో!
సూర్యచంద్రుల దిశను అటుఇటుగా మార్చవచ్చునేమో!
ఈమొండివారిని మార్చడం ఆదేవుడితరంకూడా కాదేమో!



