Facebook Twitter
పచ్చని కాపురానికి "పది ప్రమాణాలు" ....

కొత్త జంటలు
కళ్యాణం మండపంలో అందరిలో పెళ్లి పందిరిలో
ఇలా ప్రమాణాలు చేసుకుంటే వాటికి కట్టుబడివుంటే
ఆపెళ్ళి నూరేళ్లపంట వారు విడిపోవడమంటూ జరగదు

నూతన వధువుతో వరుడుచేసే ప్రమాణాలు 10.అవి

మొదటి ప్రమాణం:
హాయిగా హనీమూన్ కి  మనం వెళ్తే 
ప్రకృతి ఒడిలో పరవశించే వేళ అడవిలో
విహరించేవెేళ నిన్ను నన్ను ఏవైనా
కౄరమృగాలు అంటే ఏనుగులు కాని 
పులులుకాని సింహాలు కాని వెంటాడితే నిన్ను
నేను ఒంటరిగా వదిలి పిరికిపందలా పారిపోను

రెండవ ప్రమాణం:
అలాగె ఇద్దరంకలిసి చేసే కాపురంలో కూడ
ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని కలహాలు వచ్చినా
నిన్ను ఎడబాయను నీకు విడాకులివ్వను
మరొక స్త్రీని ముట్టుకోను ఆమె చెయ్యిని పట్టుకోను

మూడవ ప్రమాణం:
నీ కేదైనా జబ్బుచేసినేటి నీ అందముకాని
నీ ఆరోగ్యంకాని భవిష్యత్తులో దెబ్బతిన్నా
నిన్ను నేను వదలిపెట్టను నీతోనే ఉంటాను

నాగవ ప్రమాణం:
నీవు నా ప్రక్కటెముకవు గనుక
భర్తగా నీ మీద నేను పెత్తనం చలాయించను
కోపంతో కొట్టను బూతుమాటలతో తిట్టను

ఐదవ ప్రమాణం:
అనవసరమైన అనుమానాలతో
అర్థంలేని అపార్థాలతో నిన్ను అస్తమానం
అవమానాలపాలు చెయ్యను

ఆరవ ప్రమాణం:
నా కుటుంబ సభ్యులకు పంచిన స్వచ్చమైన
ప్రేమనే నీకు పంచి మా అమ్మకన్న మిన్నగా
నిన్ను నీ వారిని చూసుకుంటాను నా మాట నమ్ము

ఏడవ ప్రమాణం:
నీ ముఖంలో చిరునవ్వును తప్ప
నీ కంట ఒక్క కన్నీటిచుక్కనుకూడ
నేలరాలకుండ చూసుకుంటాను

ఎనిమిదవ ప్రమాణం:
సూదుల్లాంటి సూటిపోటి మాటలతో నిన్ను
వేధించి వెతలకుగాని మానసిక క్షోభకుగాని
గురిచెయ్యనని గుండెమీద చెయ్యివేసి చెబుతున్నాను

తొమ్మిదవ ప్రమాణం:
నిన్ను ,భగవంతుడు నాకు ప్రసాధించిన
ఒక బంగారు బహుమతిగానే భావిస్తాను తప్ప నీవు
ఒక భోగవస్తువన్న భావన నా మనసులోకి రానివ్వను
కడవరకు కన్ను మూసేవరకు నీకు తోడుగా నీ నీడగా వుంటానని ప్రమాణం చేస్తున్నాను

పదవ ప్రమాణం:
నేను ఆ రోజు అందరిలో ఆ పెళ్ళి పందిరిలో చేసిన
ఆ ప్రమాణాలన్నంటికి  ఖచ్చితంగా నేను కట్టుబడి వుంటానని తు.చ.తప్పక పాటిస్తానని మనస్పూర్తిగా మాటిస్తున్నాను నా మాట తప్పను.