Facebook Twitter
విచిత్రమైన వివాహబంధం ?

నిన్న నీకు ఆ రోజా
పువ్వునిచ్చింది
నేడు ఈ బంగారురింగు
నీ వేలికి తొడగడం కోసమే

నిన్న నీకు గుబాళించే
ఆ గులాబివిచ్చింది
నేటి ఈ మూడుముళ్ళ కోసమే

నేడు మనిద్దరం ఏకమయ్యేది
రెేపు ముగ్గురం కావడం కోసమే 

నిజానికి
నాకు నీవు నీకు నేను
నచ్చాక
నిశ్చితార్థంతో
మన ఈ పెళ్ళితంతు
మొదలై
మేళతాళాలతో
ప్రమాణాలతో
మంగళసూత్రంతో
అక్షింతలతో
మూడుముళ్ల బంధంతో
విందులతో వినోదాలతో
శోభనంతో
విహారయాత్రలతో...
(హనీమూన్)తో ముగిశాక
ప్రారంభమయ్యేదే
పదికాలాలపాటు...పచ్చగా‌సాగేదే
అసలైన సిసలైన అతి‌ విచిత్రమైన
పవిత్రమైన...మన వివాహబంధం