శూలాలు గుచ్చుకున్నా
సునామీలు ముంచెత్తినా
సుత్తి దెబ్బలెన్ని తగిలినా
అగ్నిపర్వతాలు బద్దలైనా
అగ్ని జ్వాలలు రేగినా
పిడుగులు నెత్తిన పడినా
చెక్కు చెదరని చలించని
స్థిరచిత్తమున్న మనుషులు
ఎంతటి చింతనైనా ఒత్తిడినైనా
అంతులేని మానసిక క్షోభనైనా
తట్టుకోగలరు భరించగలరు
చపలచిత్తులు బలహీనులే
కుమిలిపోతారు కృంగిపోతారు
మనోవేదనతో మంచాన పడతారు
చచ్చి సాధించేది ఏమీ లేదని తెలిసినా
ఆత్మహత్యల అంచులు దాకా వెళ్తారు
అట్టి బలహీనులెందరో
తన కేఫ్ కాఫీ డేలకు వచ్చి
ఒత్తిడిని జయించే శక్తినిచ్చే
అమృతం లాంటి దివ్యౌషధం లాంటి
తన కాఫీని త్రాగి ఒత్తిడికి దూరమైపోతే
తాను మాత్రం తనకాఫీ తానేత్రాగక
ఒక పిరికివానిలా... ఒక పిచ్చివానిలా
ఒక బలహీనుడిలా... ఒక బాధ్యతలు లేనివాడిలా
ఒక కార్పొరేట్ కింగ్ లా కాకుండా
ప్రేమపరీక్షలో ఫెయిలైన ఒక కాలేజీ కుర్రాడిలా
ఘోరమైన దారుణమైన
ఒక తప్పుడు నిర్ణయం తీసుకుని ఆవేశంతో
నేత్రావతీ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు
ఔను కాఫీకింగ్ సిద్దార్థ మరణం వెనుక మర్మమొక్కటే
తాను ఒత్తిడి చేతిలో.....చిత్తుచిత్తుగా ఓడిపోవడమే



