అందుకే ఓ బిడ్డలారా !
ఓ పచ్చినిజాన్ని తెలుసుకోండి...అతివేగం...
అత్యంత ప్రమాదకరమని...ప్రాణాంతకమని...
వేగం వెర్రితనం...ఒక్కసారి ఆలోచించండి !
బైక్ ఎక్కేముందు బాణంలా దూసుకుపోయేముందు
మీ బంగారు భవిష్యత్తును బలిచేసుకోకండి !
మీ కన్నవాళ్ళ గుండెల్లో గునపాలు గుచ్చకండి !
కమ్మని కలలెన్నోకనే వారి కళ్ళను
కన్నీటి సముద్రాలుగా మార్చకండి !
కలనైనా అలా జరగరాదని
కన్నీళ్ళతో ఆ భగవంతున్ని వేడుకుంటూ...
ఓ బిడ్డలారా ! మీకివే మా పుట్టినరోజు శుభాకాంక్షలు



