అమ్మా ఓ అమ్మా ! చెప్పమ్మా !
నీ కన్న మిన్న ఎవరమ్మా !
అమ్మా ఓ అమ్మా ! చెప్పమ్మా !
ఏ దేవత నీకంటే గొప్పమ్మా !
మా అమ్మ ప్రేమమయి
మా అమ్మ కరుణామయి
మా అమ్మ అమృతమయి
మా అమ్మ అనురాగమయి
మా అమ్మ మా ఇంటికి దీపం
మా అమ్మ మా కంటికి వెలుగు
మా అమ్మ...
అత్తమామలను గౌరవిస్తుంది
అమ్మానాన్నలను పూజిస్తుంది
అతిథి దేవుళ్ళందరిని ఆదరిస్తుంది
మా అమ్మే మాకు మార్గదర్శి ....
మా అమ్మ...
ఎంత పెద్దతప్పు చేసినా క్షమిస్తుంది
కానీ తిరిగి అదేతప్పు చేస్తే శిక్ష వేస్తుంది
మా అమ్మే మాకు ఆదిగురువు ...
మా అమ్మ...
శాంతం అంతులేని అనంత సాగరం
ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది
ఎంత కోపమొచ్చినా చిరునవ్వులు చిందిస్తుంది
మా అమ్మ ఒక సహనశీలి....
మా అమ్మ...
పిలుపులో చూపులో... కలుపుగోలుతనమే
దూరపుబంధువులామెకు దగ్గరిబంధువులే
మా అమ్మ అందరికి ఒక ఆశాజ్యోతి....
మా అమ్మ మాట మధురం...
అమ్మ ప్రేమ మాకు ఆక్సిజన్ ...
మా అమ్మ మాట...మాకు...అమృతభాండం
మా అమ్మ ఆలనా పాలనతో... మా జన్మధన్యం
మా అమ్మే ...మాకు దైర్యం...మా అమ్మే మాకు దైవం
మా అమ్మే మాకు ప్రాణం...మా అమ్మే మాకు సర్వస్వం
అందుకే ఓ అమ్మా ! మీకు వందనం ! పాదాభివందనం!!



