Facebook Twitter
మానవత్వంలేని మానవజన్మ...

నేడిక్కడ తప్పించుకున్నా
రేపు అక్కడ ఆ పరమాత్మ 
ఈ పిల్లికి‌ బిక్షం వేయని
ఈ పిసనారులందరిని
ప్రశ్నించక మానడు...
చేయగలిగి...చేతులుండీ...
సహాయం చెయ్యలేని
కాలినడకన వెళ్ళే ఆ అభాగ్యుల
కష్టాలను కన్నీళ్ళను కళ్ళుండీ...చూడలేని
వారి ఆకలికేకలు చెవులుండీ...వినలేని
కోట్లుండీ...ఇంత అన్నం పెట్టని...ఆదుకోని
హృదయముండీ...స్పందించని
పాషాణ హృదయులైన
ఆ ప్రభుత్వాధికారులను
కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులైన
ఆ బడా వ్యాపారులను,
విలాసవంతంగా జీవించే
విశ్వాసంలేని ఆ సినీసెలబ్రిటీలను
బ్రతికి వున్నంతకాలం తినలేని
పోయేనాడు ఏమీ పట్టుకు పోలేని
పరులకు పంచని దోచుకుని దాచుకున్న
ఆ కోట్ల ఆస్తి ఎందుకని ? అంత ఆశ ఎందుకని?
కాసింతైనా దయాగుణం దాతృత్వం మంచితనం
మానవత్వంలేని ఈ మానవజన్మ ఎత్తి లాభమేమని?