Facebook Twitter
అమాయకపు తల్లి ?

నిజానికి 
పెళ్లికాక ముందు 
ప్రతి ఆడపిల్ల 
అందమైన భర్త రావాలని 
కమ్మని కలలు కంటుంది 

పెళ్లయిన తర్వాత 
పండంటి బిడ్డ కలగాలని 
మరో కలగంటుంది
కోటిదేవుళ్ళకు మొక్కుకుంటుంది 

పిల్లలు పుట్టిన తర్వాత 
వారు ప్రయోజకులు కావాలని 
మంచి ఉద్యోగం రావాలని
మంచి కోడలు రావాలని
మంచి అల్లుడు రావాలని 
వ్రతాలు నోములు పూజలు చేస్తుంది 
వారికి బిడ్డలు పుట్టాక
అందరికి అడ్డమైన గొడ్డుచాకిరి చేస్తుంది

తన బిడ్డలు తమ భార్యాబిడ్డలతో
చల్లగా వుండాలని కోరుకుంటుందే తప్ప
తనను బాగాచూసుకోవాలని కలలు కనదు
తనకు కడుపు నిండా కమ్మని తిండి పెట్టాలని
ఏనాడూ కోరుకోదు.......ఆ అమాయకపు తల్లి 

కాని తాను నడవలేనప్పుడు 
తనకు కళ్ళు కానరానప్పుడు 
తన భర్త తనకు తోడుగా లేనప్పుడు
తాను మంచంలో పడినప్పుడు
మాత్రం కొన్ని మందులు కొనిపెట్టమని
కొడుకులను కోడళ్ళను మనవరాళ్లను
ప్రాదేయపడుతుంది వారి పాదాలు పట్టుకుంటుంది
ఆసుపత్రికి తీసుకెళ్లమని కొండంత ఆశతో అర్థిస్తుంది 
కన్నీటితో ప్రార్థిస్తుంది అంతే అంతకు మించిఏమీకోరదు