Facebook Twitter
జాబు వచ్చినందుకా? జన్మ నిచ్చినందుకా?

చీమంత లక్ష్యాన్ని నిర్దేశించుకొని 
ఏనుగంత ఉద్యోగం రావాలని ఆశించడం  
ఎంతటి అవివేకం? ఎంతటి వెర్రితనం?
 
కొడితే ఏనుగు కుంభస్థలాన్నే
కొట్టాలి 
పెడితే కాలు కలెక్టర్ బంగ్లాలోనే 
పెట్టాలి
ఎక్కితే ఎవరెస్ట్ శిఖరమే 
ఎక్కాలి 
మొక్కితే అమ్మానాన్న కాళ్లే 
మొక్కాలి 
ఎందుకు? జాబు వచ్చినందుకు 
కాదు కాదు జన్మ నిచ్చినందుకు