Facebook Twitter
కాలంచేసే ఇంద్రజాలం ?

నీవు ఒంటరిగా వచ్చావు

ఒంటరిగానే వెళ్లి పోతావ్

 

నీవు ఖాళీచేతులతో వచ్చావు

ఖాళీచేతులతోనే వెళ్ళిపోతావ్

 

నీవు ఏడుస్తూ వచ్చావు

ఏడుస్తుండగానే వెళ్ళిపోతావ్

 

నీవు నగ్నంగా వచ్చావు

ఖరీదైన బ్రాండెడ్ బట్టలెన్నివున్నా

తిరిగి నగ్నంగానే వెళ్ళిపోతావ్

 

నీవు వస్తూవస్తూ ఏమీతెచ్చావు 

పోతూ పోతూ పట్టుకుపోడానికి

 

కోట్లు కోట్లు ఉన్న కోటీశ్వరుడైనా

నిరుపేదగా నిష్క్రమించాల్సిందే

 

ప్రతిదీ ప్రకృతి నుండే వచ్చింది

తిరిగి ఆ ప్రకృతికే ఇచ్చివెళ్ళాలి

 

ఈ రహస్యమే సృష్టికి‌ మూలం

ఇదే ఇదే కాలంచేసే ఇంద్రజాలం