ఇద్దరూ తల్లులే... కానీ....
కన్నదొకరు పెంచుకున్నదొకరు
పెంపకంలో లోపం లేదు రక్తసంబంధంలోనే
ఆ బంధం అర్ధమయ్యేది
పసివయసులో పాలు పట్టేప్పుడు
పాలు మరిచాక బిడ్డ ఆకలిని తీర్చేప్పుడు
చిన్ననాడు కన్నతల్లి తన ఎర్రనిరక్తాన్ని
తెల్లని పాలగామార్చి బిడ్డ ఆకలిని తీరుస్తుంది
పినతల్లి ఆకలేసి బిడ్ద ఎన్ని కేకలేసినా
పట్టించుకోక పాలడబ్బాతో ఆకలిని తీరుస్తుంది
కన్నతల్లి తాను తిన్నా తినకున్నా
ఎంతో ప్రేమతోఎంతో ఆప్యాయంగా కమ్మనితిండి
కడుపు నిండా పెట్టి ఆపై పనికి వెళ్ళమంటుంది
ఆకలేస్తే మళ్ళీ తినమని లంచ్ బాక్సు చేతికిస్తుంది
పినతల్లి కఠినంగా ఖచ్చితంగా
పనిచేసి వస్తేనే తిండి అంటుంది
అది కూడా కడుపునిండా కాదు
అదికూడా ఆకలేసినప్పుడు కాదు
పెడుతుంది కాని ప్రేమతో కాదు...తిట్లతో



