దాతలందరూ ధన్యజీవులే…
కోటి విద్యలు కూటి కొరకే
ఏ కళైనా ఏ విద్యైనా
ఏ క్రీడైనా ఏ వ్యాపారమైనా
బతుకు భారం కానంత కాలం
నీతినియమాలకు
తిలోదకాలివ్వక
ఎవరేకంగా ప్రవర్తించినా
ఎట్టి కర్మలు చేసినా
బతుకుతెరువుకోసమే
జానెడు పొట్టకోసమే
పిడికెడు తిండికోసమే
కానీ, కన్నవారిని
కష్టాల్లో నెట్టకుండా
కట్టుకున్నభార్యకు
చేదోడువాదోడుగా ఉంటూ
సంసార సాగరాన్ని ఈదుతూ
ఆర్జించిన ధనాన్ని
భద్రంగా బ్యాంకుల్లో దాచుకోక
పదిమందికి దానంచేసి
మిగిలిందే కన్నవారికి పంచి
సుఖజీవనం సాగించే వారికి
దక్కును పుణ్యం పురుషార్ధం
ఔను తరతరాలకు తరగని
కరగని ధనమున్నవాడు ధనవంతుడే... కానీ
ధనవంతులందరూ దాతలు కాదు... ఐతే
దాతలందరూ ధన్యజీవులే...పుణ్యమూర్తులే...



