Facebook Twitter
ప్రాబ్లమ్ ఒక పామైతే ....

There are 4 ways 

to solve the problem

Take it   - easy

Break it - into pieces

Shake it - before solve

Lock it.  - in a dark room

 

ఒక ప్రాబ్లమ్ ఒక పామైతే 

పట్టుకొని బుట్టలో పెడితే 

చుట్టచుట్టుకొని పడుకొనివుంటుంది 

 

ఒక ప్రాబ్లమ్ ఒక పామైతే 

నాగస్వరమూదితే 

నాట్యమాడుతుంది 

 

ఒక ప్రాబ్లమ్ ఒక పామైతే 

పట్టి సంచిలోపెట్టి 

అడవిలో దూరంగా వదిలి వస్తే 

తనదారిన తానువెళ్ళి అడివిలో 

స్వేచ్ఛగా తిరుగుతుంది 

 

ఒక ప్రాబ్లమ్ ఒక పామైతే 

పెద్దపామైనా చిన్నకర్రతో 

కొట్టక పాపమని వదలి వేస్తే చివరికి

ఎవరికో ఒకరికి హాని తలపెడుతుంది 

చాటుమాటుగా తిరిగి వస్తుంది

కాటు వేస్తుంది ప్రాణాలు తీస్తుంది