ఉద్యోగం చేస్తేనే ఆదాయం
పదవీ విరమణ చేస్తే ఆదాయానికి పెద్దగండే
అప్పుడు "అత్యవసరనిధి" అత్యవసరమే
ఆనిధి ద్వారా వచ్చే ఆదాయమే వడ్డీ
ఇక ఎవరిపైనా ఆధారపడ అక్కరలేదు
ఉద్యోగం లో వున్నప్పుడే
రిటైర్ మెంట్ ఫండ్ ని ఏర్పాటు చేసుకోవాలి
ఒక పద్దతిగా ఒక ప్రణాళిక ప్రకారంగా
వీలైనంత త్వరలో పొదుపును ప్రారంభించాలి
ఆ పొదుపును, మదుపు చేయాలి
అత్యంత తెలివిగా పెట్టుబడి పెట్టాలి
సురక్షితంగా ఉండేలా రాబడికి ఖచ్చితమైన
హామీనిచ్చే విభిన్న వినూత్న పథకాలలో
ఆర్జించిన ఆస్తిని అందరికీ పంచకు,పంచి
ఆకలికి అలమటించకు అవస్థలు పడకు
అడ్డమైనవాళ్ళను దేహీ అని అడుక్కోకు
అనాధాశ్రమం చేరి అస్థిపంజరంగా మారకు
చెరువునిండగానే కుప్పలు తెప్పలుగా
కప్పలు పదివేలు చేరునని మరువకు
పంట కోతకు రాగానే కంకులు తినేందుకు
కాకులు కావుకావుమంటూ చుట్టూ చేరినట్లు
నిధి కూడా
ఒక చెరువు లాంటిదే పంటపొలం లాంటిదే
నీ కష్టార్జితాన్ని నీవే కడవరకు అనుభవించాలి
చెరువుకు "తూముంటే" నష్టం లేదు కాని
చెరువుకు"గండి"పడితే పెనుప్రమాదమే



