నిన్న సరిహద్దుల్లో
కొదమ సింహమల్లే తిరిగి
నేడు నేలకొరిగిన ఓ అమరవీరుడా!
ఓ తెలంగాణా తెలుగు బిడ్డా !
జోహార్ జోహార్ ! జోహార్ జోహార్ !!
నిన్న శతృమూకలతో పోరాడి పోరాడి
నేడు నేలకొరిగిన ఓ అమరవీరుడా!
మంచుకొండల్లో భగ్గున మండిన ఓ భాస్కరుడా:!
జోహార్ జోహార్ ! జోహార్ జోహార్ !!
ఆకాశంలో వెలిగే ఓ నక్షత్రమా !
ఎక్కడిదీ ఎక్కడిదీ నీకు మరణమెక్కడిది?
నీవు ప్రతి భారతీయుడి గుండెల్లో
అమరుడివై, ఆరనిదీపమై వెలుగుతువుంటే
ఎక్కడిదీ ఎక్కడిదీ నీకు మరణమెక్కడిది?
నీ ప్రాణత్యాగం,నీ దేశసేవ,
ఇలనైనా కలనైనా మరువలేనిది
దుష్టులు దుర్మార్గులైన మూర్ఖులు,
ముష్కరులైన ఆ చైనా శతృమూకల్ని
మట్టుపెట్టకపోతే ప్రతీకారం తీర్చుకోకపోతే
సరిహద్దుల్లోనే వారికి సమాధులు కట్టకపోతే
ఎక్కడిదీ ఎక్కడిదీ నీ ఆత్మకు శాంతి ఎక్కడిది?
ఎక్కడిదీ ఎక్కడిదీ నీ కుటుంబానికి ఓదార్పు ఎక్కడిది?
ఎక్కడిదీ ఎక్కడిదీ ఈ భరతజాతి కళ్ళల్లో కాంతి ఎక్కడిది?
ఎక్కడిదీ ఎక్కడిదీ ఆ భరతమాతకు మనశ్శాంతి ఎక్కడిది?
ఇప్పటికే లక్షలమంది మరణాలకు
కారకుడైన ఆ చైనావాడి మెడకు
కరోనా పాపం చుట్టుకుంది ఒక శాపమై
ఓ సంతోష్ కుమారా ! నీ వీరమరణంతో
వాడి గొయ్యి వాడు తవ్వుకున్నట్టే
వాడి తలను వాడు నరుక్కున్నట్టే
వాడి మరణశాసనం వాడు వ్రాసుకున్నట్టే...
త్వరలోనే మన రక్షకభటులు
సరిహద్దుల్లోనే శతృసైనికులకు,సమాధులుకట్టి
నీ ఋణం తప్పక తీర్చుకుంటారు,అప్పుడే
నీ ఆత్మకుశాంతి మాకళ్ళల్లో తరగని కాంతి...
అశ్రునివాళి...
కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ
సానుభూతిని,సంతాపాన్ని తెలియజేస్తూ
వారికి,ఈ దుఃఖాన్ని దిగమింగేశక్తిని
గుండెలు పిండే ఈ విషాదాన్ని
తట్టుకునే మనోనిబ్బరాన్ని
ప్రసాదించమని ఆపరమాత్మను ప్రార్థిస్తూ
ఆ అమరవీరుడికి అశ్రునయనాలతో
నివాళులర్పిస్తూ, జోహార్లు తెలియజేస్తూ
కల్నల్ సంతోష్ కుమార్
ఆత్మకుశాంతి చేకూరాలని కోరుతూ...



