నీ హృదయంలో ఉషోదయమెప్పుడు..?
ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
ఉరుములు
ఉరిమితే ఉరమనియ్..!
మెరుపులు
మెరిస్తే మెరవనియ్..!
పిడుగులు
పడితే పడనియ్..!
వరదలు...
సునామీలు...
వస్తే రానియ్..!
జరిగేదేదో జరగనియ్..!
మంచి జరిగితే పొంగిపోకు...
చెడు జరిగిందని క్రుంగి పోకు....
అంతా మన మంచికే అనుకో...
మౌనమే ఒక శక్తివంతమైన
మారణాయుధం..!
దేనికి అతిగా స్పందించకు..!
దేన్నీ నీ హృదయానికి
ముల్లై గ్రుచ్చుకోనీయకు..!
అప్పుడే
నీ హృదయంలో
ఉషోదయం..!
అప్పుడే నీ అంతరంగంలో
ఆకాశమంత ప్రశాంతత..!!



