Facebook Twitter
బృహత్ గ్రంధపఠనం...

"మేధస్సుకు మేత" ఔతుంది
"కళ్ళల్లో కరుణను" మనసులో
"ప్రేమామృతాన్ని" నింపుతుంది

మనిషికి
"క్షమాగుణాన్ని"నేర్పుతుంది
గాయపడిన
మనసులకు "సూపర్ టానిక్"

"హృదయం" ఎల్లప్పుడూ
ఉత్సాహంగా ఉల్లాసంగా
"జింకపిల్లలా" గంతులు వేస్తుంది

మేధస్సుకు మేత" ఔతుంది
"గొప్పసత్యాలెన్నో" బోధపడతాయి
"నవజీవన సూత్రాలెన్నో"
నేర్చుకున్నామన్న
"మెరుగైన జీవనమార్గం" తెలుసుకున్నామన్న
గర్వం మాటల్లో చూపుల్లో తొణికిసలాడుతుంది

సాటి మనిషిని మనిషిలా
చూడాలన్న "తపన"
ఆపదలో ఆదుకోవాలన్న
"తాపత్రయం" పెరుగుతుంది

ఎన్ని సమస్యలనైనా
పరిష్కరించుకోగలమన్న...
ఎట్టి దుష్ట క్లిష్టపరిస్థితులనైనా
సమర్థవంతంగాఎదర్కోగలమన్న...
గండాలనుండి సుడిగుండాలునుండి గట్టెక్కగలమన్న...
"మొండిధైర్యం" గుండెల్లో మెండుగా నిండుగా ఉంటుంది

ఎంత ఆర్జించాము ఎంతకాలం జీవించామన్నది కాక
ఉన్నంతకాలం "ఉత్తములుగా"
మచ్చలేని వ్యక్తిత్వంతో
ప్రశాంతంగా...ఉన్నతంగా...
అందరికి ఆదర్శంగా...
జీవించాలన్న "దృఢ సంకల్పం" ఏర్పడుతుంది

మంచితనంతో...మానవత్వంతో బ్రతకాలనిపిస్తుంది
నిరుపేదలకు...అనాధలకు...
అభాగ్యులకు జీవితాలను
"అంకితం" చేయాలనిపిస్తుంది

అనునిత్యం
ఆ భగవంతుని సన్నిధిలో...
ఆ పరమాత్మ దివ్యనామస్మరణతో...
నిత్యం జీవించాలనిపిస్తుంది...
జీవించి జపించాలనిపిస్తుంది...
జపించి తపించాలనిపిస్తుంది...
తపించి తరించాలనిపిస్తుంది...
ఔను బృహత్ గ్రంధపఠనంతో...
మనసంతా నిర్మలత్వమే...
మనిషిలో పరిమళించు...
మంచితనం...మానవత్వమే...