Facebook Twitter
ఏది వైరల్ ? ఏది నిజం?...

కుక్కలు
మనుషుల్ని
కరవడం కాదు వైరల్ న్యూస్
మనుషులు
కుక్కల్ని కరవడమే
ఒక షాకింగ్&బ్రేకింగ్ న్యూస్

ఒక ఎద్దును పదిపులులు
వేటాడం కాదు వైరల్ న్యూస్
నాలుగు ఎద్దులు
ఒక సింహాన్ని సంహరించడమే
ఒక షాకింగ్&బ్రేకింగ్ న్యూస్

కాటికెళ్ళేవారికి కరోనా
సోకడం కాదు వైరల్ న్యూస్
సోకి,120 ఏళ్ళముసలి
బామ్మ కోలుకోవడమే
ఒక షాకింగ్&బ్రేకింగ్ న్యూస్

కాలిలో ముళ్ళు
గుచ్చుకోవడం కాదు వైరల్ న్యూస్
కంటిలో ముళ్ళు గుచ్చుకోవడమే
ఒక షాకింగ్&బ్రేకింగ్ న్యూస్

కోతులు చెట్లు
ఎక్కడం కాదు వైరల్ న్యూస్
ఏనుగులు ఎవరెస్టు శిఖరం ఎక్కడమే
ఒక షాకింగ్&బ్రేకింగ్ న్యూస్

తిరుగుబోతు
త్రాగుబోతు భర్తలు
భార్యల్ని క్రూరంగా
హింసించడం కాదు వైరల్ న్యూస్
పరపురుషుల వలలో చిక్కుకున్న 
పతివ్రతలు భర్తలను హతమార్చడమే
ఒక షాకింగ్  బ్రేకింగ్&వైరల్ న్యూస్