Facebook Twitter
బాధ...భారతీయులకు..! ఆనందం...ఆస్ట్రేలియాకు..!

అనుకున్న దొక్కటి...
అయ్యిందింకొక్కటి...
బోల్తా కొట్టందిలే...
బుల్ బుల్ పిట్ట...అన్నట్టు...

లక్షా 32 వేలమంది
క్రీడాభిమానులతో కిక్కిరిసిన
ప్రపంచంలోనే అతి పెద్దదైన
మోడీ క్రికెట్ స్టేడియంలో...
ఫైనల్ క్రికెట్ మ్యాచ్ లో...

కెప్టెన్ రోహిత్ శర్మ
టీమిండియా జట్టుపై
ఎన్నో ఆశలు పెట్టుకొని
2013 ఫైనల్లో మనల్ని ఓడించి
ప్రపంచకప్ ను కైవశం చేసుకున్న
"ప్రమాదకరమైన మన ప్రత్యర్థి"
ఆస్ట్రేలియాను దిమ్మతిరిగే
బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లతో
భారీస్కోర్ చేసి మట్టికరిపించి...

2023 ఫైనల్లో 16 కోట్ల
ప్రైజ్ మనీతో ఇంటికి పంపి
ప్రతీకారం తీర్చుకోవాలని...
33 కోట్ల ప్రైజ్ మనీ కోసం
భారీ అంచనాలతో...
బరిలోకి దిగిన భారత్ జట్టు

ఫైనల్లో 240 పరుగుల స్కోర్ చేసి
నాడు గంగూలీ సేనలా నేడు
రోహిత్ సేన ఓటమికి గురికాగా
కోటి ఆశలతో టీవీ సెట్లకు
అతుక్కుపోయిన 140 కోట్లమంది
భారతీయుల "కప్పుకల" చెదిరింది...
అంతులేని ఆవేదనే అందరికి మిగిలింది...

విశ్వకిరీటం...
విజయ సింహాసనం...
13 వ ప్రపంచ క్రికెట్ కప్‌...
ఆరోసారి ఆస్ట్రేలియాకే...దక్కింది
మన ప్రధాని మోడీ చేతులమీదుగా...

ఓడిపోకూడదన్న వ్యక్తిత్వం...
చివరిదాకా పోరాడాలన్న మనస్తత్వం...
ఉన్నవాళ్ళే కదా అవనిలో "విశ్వవిజేతలు"...

ఔను కడకు ఆనందం...ఆస్ట్రేలియాకు..!
దురదృష్టం దుఃఖం....భారతీయులకు..!